ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారి నిర్మాణం ఆపాలని రావులపాలెంలో నిరసన - రావులపాలెంలో స్థానికుల నిరసన

రహదారి నిర్మాణం ఆపాలని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రహదారుల డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్​లో 60, 40 అడుగుల రోడ్లు వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. రోడ్డు పనులను నిలిపివేయాలంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి స్థానికులు విన్నవించుకోగా...ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. పంట పొలాలను తీసేసి...కొత్త రోడ్లు వేయొద్దని అధికారుల వద్ద వారు నిరసన తెలిపారు. పంట పొలాలకు, గృహాలకు ఇబ్బంది లేకుండా కొత్త రోడ్డును నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

Locals protest in Ravulapalem to stop road construction
అధికారులతో వాగ్వాదానికి దిగిన స్థానికులు

By

Published : Mar 4, 2020, 1:35 PM IST

..

రహదారి నిర్మాణం ఆపాలని రావులపాలెంలో స్థానికుల నిరసన

ABOUT THE AUTHOR

...view details