రాజోలు మండలం కడలి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఒక్క వార్డు కూడా రిజర్వ్ చేయకపోవటంపై స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో 1450 మంది బీసీ ఓటర్లులున్నా ఒక్క వార్డు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీ, ఎస్సీ వర్గీయులకే వార్డులు రిజర్వ్ చేశారని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
బీసీలకు వార్డు రిజర్వ్ చేయాలంటూ.. రాజోలులో స్థానికుల ఆందోళన - కడలి పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌పై స్థానికుల ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో స్థానికులు ఆందోళన చేపట్టారు. బీసీలకు ఒక్క వార్డు కూడా రిజర్వ్ చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![బీసీలకు వార్డు రిజర్వ్ చేయాలంటూ.. రాజోలులో స్థానికుల ఆందోళన BCs reservations issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10507379-397-10507379-1612508096580.jpg)
బీసీలకు వార్డ్ రిజర్వ్ చేయాలంటూ.. రాజోలులో స్థానికుల ఆందోళన