ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు సిద్దం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

రేపు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తాళ్లరేవు మండలం పరిధిలో 198 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు.. సుమారు 600 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి విజయ్‌థామస్‌ తెలిపారు.

local body elactions in east godavari
local body elactions in east godavari

By

Published : Feb 8, 2021, 1:00 PM IST

తూర్పుగోదారి జిల్లా కాకినాడ రెవిన్యూ డివిజన్‌లోని తాళ్లరేవు మండలం పరిధిలో.. మంగళవారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సర్పంచ్‌, వార్డు మెంబర్లు ఎన్నికలకు సంబంధించి తాళ్లరేవు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం ఆవరణలో.. సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. మండలం పరిధిలో 198 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు.. సుమారు 600 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి విజయ్‌థామస్‌ తెలిపారు. సిబ్బందిని రూట్ల వారిగా విభజించి పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు.

ABOUT THE AUTHOR

...view details