ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1647 మద్యం సీసాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ - అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్

అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురిని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లో పోలీసులు అరెస్టు చేశారు. లక్షా 40వేల రూపాయలు విలువ చేసే 1647 మద్యం సీసాలు పోలీసులు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానం నుంచి అక్రమ మద్యాన్ని అమలాపురం డివిజన్​లోని ఉప్పలగుప్తం మండలం చిన్న గాడవిల్లికి తరలిస్తున్నారు.

llegal_madyam_traced_amalapuram
అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్

By

Published : Jul 21, 2021, 11:25 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లోని ఉప్పలగుప్తం మండలం చిన్న గాడవిల్లిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యం బయటపడింది. యానాంకు చెందిన కనకాల సురేష్ నక్కల శ్రీనివాస్, దంగేటి సత్య దుర్గాప్రసాద్ నుంచి కారులో లక్షా 40 వేల రూపాయలు విలువచేసే 1647 మద్యం సీసాలను యానం నుంచి కారులో తరలిస్తున్నారు.

చిన్న గాడవిల్లిలో పోలీసుల తనిఖిలు గమనించిన ముగ్గురు వ్యక్తులు కారును రోడ్డు పక్కన నిలిపి అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి నిందితులను అరెస్టు చేశారు. ఉప్పలగుప్తం మండలం చిన్న గాడవిల్లికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తికి మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని అమలాపురం రూరల్ సీఐ జి సురేష్ బాబు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఉప్పలగుప్తం ఎస్ఐ జీ వెంకటేశ్వరరావును డి ఎస్పీ వై.మాధవ రెడ్డి అభినందించారు.

ఇదీ చదవండి:

Achenna: నిధులున్న కార్పొరేషన్లన్నీ సీఎం సొంత వర్గానికే: అచ్చెన్న

ABOUT THE AUTHOR

...view details