రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ వైన్షాప్లలో పని చేస్తున్న.. సూపర్వైజర్, సేల్స్మాన్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. రాజమండ్రి బేవరేజెస్ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ.. డీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాకు హమాలీ కార్మికులు సంఘీభావం తెలిపారు. రెడ్డి ఎంటర్ ప్రైజెస్ వారు కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ సొమ్మును కాజేస్తున్నారని.. ఏపీఎస్బీసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తాటిపాక మధు ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నత అధికారులకు మొర పెట్టుకున్నా స్పందన లేదన్నారు. రెడ్డి సంస్థను రద్దు చేసి ఏపీసీఓఎస్లో కలాపాలని కోరారు.
సమస్యలు పరిష్కరించాలని.. ప్రభుత్వ మద్యం షాపు సిబ్బంది ఆందోళన - ఈరోజు మద్యం దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన వార్తలు
ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. రాజమండ్రి డిపో ఎదుట ధర్నాకు దిగారు. వీరి ఆందోళనకు హమాలీ కార్మికుల సంఘం సంఘీబావం తెలిపింది. తమ సమస్యలు పరిష్కరించకుంటే.. 28న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేస్తామని పేర్కొన్నారు.
![సమస్యలు పరిష్కరించాలని.. ప్రభుత్వ మద్యం షాపు సిబ్బంది ఆందోళన liquor employees concern](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:06:12:1619148972-ap-rjy-88-22-madyam-karmikula-nirasana-av-ap10023-22042021204014-2204f-1619104214-662.jpg)
liquor employees concern
తమ సమస్యలు పరిష్కరించకుంటే 28న వైన్ షాపులు బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నల్ల రామారావు, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి…