కరోనా తీవ్రత తగ్గేవరకూ మద్యం దుకాణాల్లో అమ్మకాలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ మద్యం నియంత్రణ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిరసన దీక్ష నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. మద్యం దుకాణాల వద్ద గుంపులుగా జనం చేరడం, కలిసి తాగడం వల్ల కరోనా వ్యాప్తి ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
'కరోనా తగ్గేవరకూ మద్యం షాపులు మూసేయండి '
మద్యం దుకాణాల వల్లే కరోనా వ్యాప్తి పెరిగిందని ఏపీ మద్యం నియంత్రణ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రమణరాజు ఆరోపించారు. కరోనా తగ్గేంతవరకూ మద్యం అమ్మకాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల వద్ద పర్యవేక్షణ లేకపోవడంతో... జనం గుంపులుగా చేరుతున్నారని, కరోనా వ్యాప్తికి కారకులౌతున్నారని ఆరోపించారు.
'కరోనా తగ్గేవరకూ మద్యం షాపులు మూసేయండి '
రాష్ట్ర ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలకు ప్రోత్సహించడం సరికాదన్నారు. కరోనా కేసుల్లో 50 శాతం .. మద్యం అమ్మకాల ద్వారానే విస్తరిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి :ఆకలి తీర్చలేక శిశువు విక్రయం.. గ్రామస్థుల ఆపన్నహస్తం