స్థానిక సంస్థల ఎన్నికల వేళ పలు జిల్లాలో పోలీసులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేయటంతోపాటు వారి వాహనాలను సీజ్ చేశారు.
గుంటూరు జిల్లా
స్థానిక ఎన్నికల్లో మద్యం సరఫరా చేయడానికి తీసుకువచ్చిన రూ.18,23,000 విలువ చేసే తెలంగాణ మద్యాన్ని గుంటూరు అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ముఠా సభ్యులను.. రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో తెలంగాణకు చెందిన 100 మద్యం బాటిల్స్, ఒక ద్విచక్ర వాహనంను సత్తెనపల్లి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం రంగాపురం గ్రామంలో భూమిలో నిల్వచేసిన మొత్తం రెండు వేల లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వీర్యం చేశారు. 20 లీటర్ల నాటుసారాతో పాటు ఇద్దరు నిందితులను వారు అదుపులోకి తీసుకున్నారు
కర్నూలు జిల్లా