తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో 2017లో జరిగిన మహిళల హత్య కేసులో నిందితుడు సలాది లక్ష్మీనారాయణకు జీవిత ఖైదు విధించారు.
దుర్గమ్మ కథలు చెప్తూ.. మహిళలు వలలో వేసుకునేవాడు!
కపిలేశ్వరపురం మండలం కేదారిలంకకు చెందిన లక్ష్మీనారాయణ దుర్గమ్మ కథలు చెబుతూ అమాయక మహిళలను మభ్యపెట్టి.. ధవళేశ్వరం బ్యారేజి దిగువన పిచ్చుకలంక ఇసుక తిన్నెలు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. అనంతరం వారిని చంపి నగలతో ఉడాయించేవాడు.
ఇలా వెలుగులోకి...
2017లో భాగ్యవతి అనే మహిళను మామిడికుదురులో ఇదే విధంగా హతమార్చాడు. పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయగా..నిందితుడు ఐదుగురు మహిళలు అత్యాచారం చేసి మట్టుబెట్టినట్లు తేలింది. లక్ష్మీనారాయణను పట్టుకుని అరెస్ట్ చేయగా.. 2019లో విచారణ నిమిత్తం రాజమహేంద్రవరం నుంచి రాజోలు కోర్టుకు తీసుకొస్తుండగా తప్పించుకుని పారిపోయాడు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని అమలాపురం కోర్టులో హాజరుపర్చగా.. జీవిత ఖైదు విధించారు.
ఇదీ చదవండి:మద్యం మత్తులో దాడి.. బాలుడి మృతి