తూనికలు కొలతల్లో మోసాలకు పాల్పడినా, ప్రభుత్వం నిర్దేశించిన నిత్యవాసరాల ధరలకంటే అధికంగా అమ్మినా చర్యలు తప్పవని తూనికలు కొలతలు శాఖ ఏలూరు రీజియన్ జాయింట్ కమిషనర్ సుధాకర్ హెచ్చరించారు. తనిఖీల్లో భాగంగా కాకినాడలోని తూనికలు కొలతలు శాఖ ఉపకార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ కాలంలో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనల అతిక్రమణలపై 1595 కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత పరిస్థితి సద్దుమణిగిందన్నారు. వినియోగదారులు ఎవరైనా మోసపోయే పరిస్థితి ఉంటే 1902 నెంబరుకి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
'నిత్యావసరాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు' - తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన తూనికలు కొలతల శాఖ రీజియన్ జాయింట్ కమిషనర్
కాకినాడలోని తూనికలు కొలతలు శాఖ ఉపకార్యాలయాన్ని... ఆ శాఖ ఏలూరు రీజియన్ జాయింట్ కమిషనర్ సుధాకర్ సందర్శించారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. సమీక్షలో తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ కంట్రోలర్ మాధురి, ఇతర ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
లాక్‌డౌన్ సమయంలో 1595 కేసులు నమోదు చేసినట్లు తెలిపిన అధికారి