యానాంలో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు - latest Puducherry leberation day news in telugu
ఏటా పుదుచ్చేరిలో నిర్వహించే విమోచన దినోత్సవాన్ని... యానాం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... గౌరవ వందనం స్వీకరించారు.
leberation day Celebrations at yaanam
దేశానికి బ్రిటిషు వారి నుంచి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా... పుదుచ్చేరి మాత్రం 1954 నవంబర్ 1న పూర్తిస్థాయిలో భారతదేశంలో విలీనమైంది. అప్పటి నుంచి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతోంది. ఏటా పుదుచ్చేరి విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు. యానాం బాలయోగి క్రీడా ప్రాంగణంలో... డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.