ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

kadium trees to Mukesh Ambani house: అంబానీ ఇంటికీ కడియం చెట్లు... తూర్పుగోదావరి జిల్లా నుంచి తరలింపు - kadium trees to Mukesh Ambani house

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ ఇంట తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు కనువిందు చేయనున్నాయి. ఇక్కడి నుంచి రెండు ఆలివ్‌ చెట్లను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్మించే ఇంటి ఆవరణలో నాటేందుకు గురువారం రాత్రి ట్రాలీలో తరలించారు.

అంబానీ ఇంటికీ కడియం చెట్లు
అంబానీ ఇంటికీ కడియం చెట్లు

By

Published : Nov 26, 2021, 10:41 AM IST

kadium trees to Mukesh Ambani house: తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు... ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ ఇంట కనువిందు చేయనున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో నాటేందుకు ఇక్కడి నుంచి రెండు ఆలివ్‌ చెట్లను గురువారం రాత్రి ట్రాలీలో తరలించారు. ఒక్కో చెట్టు రూ.22 లక్షలని, రవాణాకు రూ.3 లక్షలు అవుతుందని గౌతమి నర్సరీ అధినేత మార్గాని వీరబాబు తెలిపారు. ఈ చెట్లను గతంలో స్పెయిన్‌లో నుంచి తెచ్చినట్లు చెప్పారు. చాలా ఏళ్లుగా ప్రత్యేక శ్రద్ధతో పెంచగా ఇంత ధర దక్కిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details