తూర్పుగోదావరి జిల్లా సీతానగరం యువకుడి శిరోముండనం ఘటనలో అసలైన నిందితుల్ని శిక్షించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత శైలజానాథ్ రాజమహేంద్రవరం ప్రభుత్వ అస్పత్రిలో బాధితున్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పేదలు రాష్ట్రంలో బతకడానికి వీలులేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లలో ఏదో ఒక చోట పేదవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.
శిరోముండనం బాధితుడిని పరామర్శించిన వివిధ పార్టీల నాయకులు - rajamahendravaram latest news
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం యువకుడి శిరోముండనం వ్యవహారంపై వివిధ పార్టీల నాయకులు స్పందించారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితున్ని పరామర్శించిన వివిధ పార్టీల నాయకులు
సమాజంలో పేదవారిపై ఇలాంటి ఘటనలు జరగటం దారుణమని జనసేన నాయకుడు కందుల దుర్గేష్ అవేదన వ్యక్తం చేశారు. రాజనగరం నియోజకవర్గంలోనే ఎస్సీ యువతిపై అత్యాచారం, ఎస్సీ యువకుడు శిరోముండనం వంటి ఘటనలు జరగటంపై అంతా ఆలోచించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం సంపతరావు అన్నారు. ఇదీ చాలా దుర్మార్గమైన చర్య అని భాజపా నాయకుడు పరిమి రాధా కృష్ణ అన్నారు.