తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో తమ నాయకుల భూములను వారి అంగీకారం లేకుండా ఇళ్లస్థలాల కోసం తీసుకోవడం పట్ల తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల భూములను కావాలనే తీసుకోవడం దారుణమన్నారు. అధికారుల ఏ విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపించారని నేతలు నిలదీశారు.
'ప్రభుత్వానికి ఏమని నివేదిక పంపారు..?' - తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే వైకాపా తీరును దుయ్యబట్టారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే... వైకాపా తీరుపై మండిపడ్డారు. తెదేపా రైతుల భూములను వారి అంగీకారం లేకుండా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆరోపించారు.
!['ప్రభుత్వానికి ఏమని నివేదిక పంపారు..?' east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7114700-731-7114700-1588936640497.jpg)
రైతుల భూములను ఎలా ఇస్తారు..