పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబానికి న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ముస్లిం సంఘాల నేతలు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఘటనకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ.. స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌కు, స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రాలు సమర్పించారు.
ముమ్మడివరంలో జాతీయ రహదారిపై ముస్లిం సంఘాల ర్యాలీ
సలాం కుటుంబ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముమ్మడివరంలో ముస్లిం సంఘాల నేతలు ర్యాలీ చేశారు. స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌కు, తహసీల్దార్‌కు వినతి పత్రాలు సమర్పించారు.
ముస్లిం సంఘాల నేతలు జాతీయ రహదారిపై ర్యాలీ