రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు ఇస్తామని... ఇప్పటికీ ఇవ్వలేదని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మండిపడ్డారు. నిధులు ఇచ్చి ఉంటే కరోనా సమయంలో న్యాయవాదులు ఆర్ధిక ఇబ్బందులు నుంచి బయటపడేవారన్నారు.
హామీలు నెరవేర్చాలని న్యాయవాదుల నిరసన - హామీలు నెరవేర్చాలని న్యాయవాదుల నిరసన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు ఇస్తామని... ఇప్పటికీ ఇవ్వలేదని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మండిపడ్డారు.
హామీలు నెరవేర్చాలని న్యాయవాదుల నిరసన !
అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు నాలుగు నెలల నుంచి ఇవ్వాల్సిన స్టైఫండ్ తక్షణమే చెల్లించాలన్నారు. చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ఇస్తామని చెప్పిన 4 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ నిధులను వెంటనే విడుదలు చేయాలని ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.