ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయవాది అరెస్ట్ తీరుపై కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన న్యాయవాదిని అరెస్ట్ చేసిన తీరు దారుణమని కుటుంబ సభ్యులు పర్యంతమయ్యారు. అరెస్ట్ విధానం తమను భయభ్రాంతులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

lawyer arrested
న్యాయవాది అరెస్ట్ తీరుపై కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు

By

Published : Jul 20, 2020, 10:17 PM IST

న్యాయవాది అరెస్ట్ తీరుపై కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయితీకి చెందిన న్యాయవాది, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పైలా సుభాష్‌చంద్రబోస్‌ని ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా గోడలు దూకి తలుపులు బద్దలుకొట్టి సుమారు 15 మంది పోలీసులు బోసుని అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బోస్​ను అరెస్టు చేసిన విధానం తమను భయభ్రాంతులకు గురి చేసిందని వాపోయారు. న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్కడా పోలీసులు సమాచారం తెలియజేయకపోవటంతో ఆయన కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించగా... జిల్లా ఎస్పీని మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది.

ఇవీ చూడండి-న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని తూ.గో జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details