గోదావరి వరద కష్టాలు ఏజన్సీ వాసులను వీడటం లేదు. దేవీపట్నం మండల పరిధికి సంబంధించి జల దిగ్బంధంలో 30గ్రామాలు ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు బాధ్యత లేకుండా ఉంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జల దిగ్బంధంలో 30గ్రామాలు, ఇంకా చేరుకోని అధికారులు - జలదిగ్భంలో 30గ్రామాలు
గోదావరి వరద తగ్గుముఖం పట్టి నాలుగురోజులైనా ఏజెన్సీ వాసులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతునే ఉన్నారు. జల దిగ్బంధంలో 30గ్రామాలు ఉన్నా అధికారులు ఇంత వరకు తమను ఆదుకునేందుకు రాలేదని బాధితులు వాపోతున్నారు.
పూర్తిగా మునిగిపోయిన ఇల్లు