ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనస కాదు... పే..........ద్ద దోస

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో.. రెవెన్యూ ఉద్యోగి కిశోర్‌ డాబా పై.. పెంచిన దోస మొక్క అందరిని అబ్బురపరుస్తోంది. కుండీలో వేసిన ఈ మొక్కకు కాసిన దోసకాయలు.. సాధారణ దోస కన్నా ఎన్నోరెట్లు అధిక పరిమాణంలో ఉండటం విశేషం.

Large cucumbers in yanam
అసాధారణంగా పెరిగిన దోసకాయలు

By

Published : Apr 29, 2021, 3:25 PM IST

అసాధారణంగా పెరిగిన దోసకాయలు

కుండీలో వేసిన మొక్క కడవంత కాయలు కాసి అందరిని అబ్బురపరుస్తోంది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కుండీలో పెంచిన దోస మొక్కకు పెద్ద సైజ్‌లో కాసిన మూడు దోసకాయలు ఆకట్టుకుంటున్నాయి. సాధారణ దోస కన్నా ఎన్నోరెట్లు అధిక పరిమాణంలో ఉండటం ఇట్టే ఆకర్షిస్తోంది. రెవెన్యూ ఉద్యోగి కిశోర్‌ డాబా పైన వివిధ కుండీల్లో పూల మొక్కలు.. బీర బొబ్బర్లు.. వంకాయ.. టమోటా కూరగాయ మొక్కలు నాటారు. పూర్తిగా సేంద్రీయ పద్దతిలో మొక్కలు పెంచుతున్నారు. ఈ క్రమంలోనే దోస చెట్టుకు ఒక్కొక్కటి 4 కిలోల బరువు, 40 సెంటీమీటర్ల పొడవు ఉండే మూడు దోసకాయలు కాశాయి.

ABOUT THE AUTHOR

...view details