ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేలరాలిన పంట.. కుదేలైన అన్నదాతలు - Huge rains in east godavari latest News

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతన్నలు కుదేలవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో భారీ వానలకు పంటలు దెబ్బతిన్నాయి.

నేలరాలిన పంట.. కుదేలైన అన్నదాతలు
నేలరాలిన పంట.. కుదేలైన అన్నదాతలు

By

Published : Oct 14, 2020, 2:09 AM IST

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలాల్లో భారీ వర్షాల కారణంగా రైతులు కుదేలయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల వరి పంట నేలకొరిగింది.

  • పెట్టుబడి నష్టం..

ఎకరాకు సుమారు 30 వేల రూపాయలతో పెట్టుబడులు పెట్టామని.. ప్రస్తుత పరిస్థితితో పంటలు నేలరాలిపోయాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాల కష్టంతో పంట చేతికి అందే సమయానికి అకాల వర్షంతో పంటలు తీవ్రంగా పాడయ్యాయని వాపోయారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details