ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి వరదలో లంక గ్రామాలు..ప్రజలకు ఇక్కట్లు

గోదావరి లంక గ్రామలకు ముంపు పొంచి ఉంది. వరద కారణంగా వశిష్ఠ గోదావరిపై ఉన్న గట్టు తెగిపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లంక గ్రామాల్లో నీటి ఉధృతి ఎక్కువ అవడంతో తెగిపోయిన ఆనకట్ట

By

Published : Jul 30, 2019, 12:38 PM IST

లంక గ్రామాల్లో నీటి ఉధృతి ఎక్కువ అవడంతో తెగిపోయిన ఆనకట్ట
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పెదపూడి, అరిగెలవారిపేట, బురుగు లంక గ్రామాలు వశిష్ఠ గోదావరి నది పాయకు మధ్యలో ఉన్నాయి. ఆ గ్రామాలకు చేరువలో నదికి రహదారికి మధ్య ఉన్న గట్టు వరద తాకిడికి తెగిపోయింది. ఈ కారణంగా అక్కడ ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. నాలుగు లంక గ్రామాల ప్రజలు గోదావరి నదీ పాయ పైవంతెన లేక ఏళ్ల తరబడి అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోజూవారీ పనులకు వెళ్లాలంటే పడవపై ప్రమాదంగా ప్రయాణించాల్సిందే. అలాగే బడికి వెళ్లేందుకు పిల్లలు కూడా పడవలో వెళ్లాల్సిందే.

ప్రతీసారి ఇదే పరిస్థితి
వర్షాకాలం వస్తే చాలు.. అందరికీ నావ తప్ప వేరే మార్గం లేదు. పిల్లలు బడికి, పెద్దలు పనులకు వేళ్లాలన్నా నది దాటాల్సిందే. ఒక వంతెన కావాలని ఏళ్ల తరబడి అడుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు మూడు రోజులుగా వరద పోటు ఎత్తడంతో పోలవరం ఎగువ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం మండలం కొత్తూరు కాజ్​వే పైకి వరద నీరు మూడు అడుగుల మేర చేరుకోవటంతో ట్యూబ్​లకు తడికలు కట్టి ప్రజలను దాట వేస్తున్నారు.

ఇది చూడండి: "మా దేశానికి రండి"... జగన్​కు జపాన్ ప్రతినిధుల ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details