తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలో దళిత రైతులకు చెందిన లంక భూముల్లో మట్టి తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, దళిత రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ భూముల్లో మట్టిని తీసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతులు అన్నాయని.. అడ్డుకోవటం చట్ట రిత్యా నేరమని ఎస్ఐ రైతులకు తెలిపారు. దళితుల భూముల్లో మట్టిని తరలించడం అన్యాయమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
44 ఏళ్ల క్రితమే ప్రభుత్వం తమకు లంక భూమిని పట్టాలపై ఇచ్చిందని.. ఆ భూమిని ఆనుకొని ఉన్న పెరుగులంకలో మట్టి తవ్వకాలు చేపడితే.. తామంత నష్టపోతామని ఆవేదన చెందారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఇక్కడ మట్టి తవ్వకాలు తాము అడ్డుకుంటామని రైతులు స్పష్టం చేశారు. దీనిని ఆధారంగా చేసుకొని 200 రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని బాధితలు ఎస్ఐకు వివరించారు.
కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామస్థులు ఆందోళన..