తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలారు. ఫలితంగా.. గోదావరి పరివాహక లంక భూములు కోతకు గురవుతున్నాయి. అంతేగాక ముమ్మిడివరం పరిధిలోని లంకల్లో నిటారుగా ఉన్న కొబ్బరిచెట్లు తెల్లవారేసరికి గోదావరిలోకి ఒరిగిపోయి కనిపించాయి. మరికొన్ని కనిపించకుండాపోయాయి. వాటినే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వందలాది కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. తాతలకాలంలోని వందల ఎకరాలు ఉన్న లంకభూములు మనవళ్ల కాలానికి వచ్చేసరికి సెంటుభూమి మిగలలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కోతలను ఆపే పనులను చేపట్టలేకపోయారని భూ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
గోదారి శోకం... లంక రైతుల గుండె"కోత" - east godavari district
గోదావరి లంక రైతులకు గుండెకోతను మిగిల్చుతోంది. ప్రతిఏటా వరదల సమయంలో భూమి కోతకు గురవుతోంది. ప్రస్తుతం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కోత పెరిగింది.
Lanka lands are severely eroding with the rising flood of the Godavari at east godavari district