ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కందుకూరి వీరేశలింగం.. హితకారిణి సమాజం భూములపైన సర్కారు కన్ను! - దేవాదాయ శాఖ కమిషనర్

Hitakarini society: సమాజహితం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన త్యాగధనుల ఆస్తులపైనా వైకాపా సర్కార్ కన్నుపడింది. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం యావదాస్తి ధారపోసి స్థాపించిన హితకారిణి సమాజం భూముల స్వాధీనానికి పావులు కదపుతోంది. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనం పేరిట రాజమహేంద్రవరంలోని 200 కోట్ల విలువైన హితకారిణి సమాజం భూములను లాగేసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 4, 2022, 9:58 AM IST

Hitakarini society: కందుకూరి వీరేశలింగం సమాజంలో దురాచారాలను పారద్రోలేందుకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. వితంతు వివాహాలు జరిపించి, విద్యను ప్రోత్సహించారు. తన తదనంతరం ఈ కార్యక్రమాలు కొనసాగేలా హితకారిణి సమాజం స్థాపించి తన ఆస్తి మొత్తం రాసిచ్చారు. అప్పటి నుంచి ఈ సమాజం ఆధ్వర్యంలో విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని 31 ఎకరాల విస్తీర్ణంలోని హితకారిణి సమాజం విద్యాసంస్థల ప్రాంగణాలపై ప్రభుత్వం కన్నేసింది. 200 కోట్ల విలువైన ఆ భూములు తమకు ఇచ్చేయాలంటూ విద్యాశాఖ పట్టుబడుతోంది. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రాంగణాలను తీసుకున్నాక.. వాటిలో అదనంగా ఉన్న భూముల్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చనే వెసులుబాటును గతంలో ప్రభుత్వం కల్పించింది. ఈ పరిస్థితుల్లో హితకారిణి సమాజం భూముల్ని విద్యాశాఖ కోరడంపై.. విమర్శలు వెల్లువెత్తున్నాయి.

హితకారణి సమాజం పరిధిలో ఎయిడెడ్‌లో ఎస్​కేవీటీ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలు, ఎస్​కేఆర్​ మహిళా కళాశాల, ఎస్​కేవీటీ. డిగ్రీ కళాశాల వీటి . జూనియర్ కళాశాల, డీఎడ్ కళాశాల, ఎంబీఏ కళాశాల, కందుకూరి స్త్రీ సదనం ఉన్నాయి. దానవాయిపేట, ఇన్నీస్ పేటలో ఈ ప్రాంగణాలు కలిపి 31 ఎకరాల్లో ఉన్నాయి. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ప్రభుత్వానికి అప్పగించినా.. ఆ ప్రాంగణాల్లోనే ఉన్న అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు హితకారిణి సమాజం పరిధిలోనే కొనసాగాల్సి ఉంది.

ఈ భూములు ఇచ్చేయాలని విద్యా శాఖ కోరడంపై ప్రస్తుత పర్యవేక్షిస్తున్న దేవదాయశాఖ అభ్యంతరం చెబుతోంది. ఈ వ్యవహారం ఇటీవల సీఎం కార్యాలయానికి చేరింది. ఇరు శాఖల ఉన్నతాధికారులు సమీక్ష అనంతరం అన్ని ప్రాంగణాలను సర్వే చేయించాలని నిర్ణయించారు. సర్వే అనంతరం నిర్ణయించిన విస్తీర్ణం మేరకు విద్యాశాఖకు అప్పగించాలని తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆ భూముల సర్వే చేపట్టే అవకాశం ఉంది.

హితకారిణి సమాజం భూములపైన సర్కారు కన్ను

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details