తూర్పుగోదావరి జిల్లా లింగపర్థి తహశీల్దారు కార్యాలయం ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. వేలం పాట ద్వారా తమ భూముల్ని వైకాపా నేతలు దక్కించుకున్నారని ఆరోపించారు. వీరికి పలు పార్టీల నేతలు మద్దతు పలికారు. వేలం పాట వంకతో వైకాపా నేతలు దళితుల భూములను దక్కించుకుంటున్నారని తెదేపా నేత వరుపుల రాజా మండిపడ్డారు. ఈ భూములు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఏలేశ్వరం తహశీల్దారు కార్యాలయం ఎదుట 9 రోజులుగా దళితులు నిరాహారదీక్ష చేస్తున్నారు.
'వేలం పాటలో వైకాపా నేతలు భూములు దక్కించుకున్నారు' - tdp
వేలం పాట ద్వారా తమ భూముల్ని వైకాపా నేతలు దక్కించుకున్నారని తూ.గో జిల్లా లింగపర్థి తహశీల్దారు కార్యాలయం ఎదుట దళితులు ఆందోళన చేశారు. వీరికి తెదేపా, సీపీఎం నేతలు మద్దతు పలికారు.
తెదేపా
లింగంపర్థిలోని 3 దేవాలయాలకు చెందిన 92ఎకరాల భూములను ఇటీవల అధికారులు వేలం పాట నిర్వహించారని ఆందోళనకారులు ఆరోపించారు. ఇందులో ఏడాదికి ఎకరానికి 40వేలకు పైగా చొప్పున కౌలుకు ఇచ్చారని చెప్పారు.
ఇదీ చదవండి:ఆదాయ మార్గాలు అన్వేషించకుండా అప్పులతో పాలన ఎన్నాళ్లు ?: యనమల
Last Updated : Jul 23, 2021, 6:56 PM IST