ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు - temple land issue

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముంగడంలో ఆక్రమణలో ఉన్న ఆలయానికి సంబంధించిన భూమిని గ్రామస్థులు స్వాధీనం చేసుకున్నారు. అ స్థలంలో గుడిని నిర్మిస్తామని గ్రామస్థులు వెల్లడించారు.

temple land issue
ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు

By

Published : Jan 21, 2020, 10:38 PM IST

ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు
తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముంగండంలో సంవత్సరాల తరబడి ఆక్రమణలో ఉన్న ఆలయానికి సంబంధించిన భూమిని గ్రామస్థులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన రహదారి వెంట పోతురాజు బాబు గుడికి సంబంధించిన లక్షలాది రూపాయలు విలువ చేసే భూమి ఆక్రమణకు గురైంది. పూర్వకాలం నుంచి ఈ భూమి ఆలయ పరిధిలో ఉందని స్థానికులు తెలిపారు. కొంతమంది ఆక్రమించుకుని సొంతంగా వాడుకుంటున్నారని ఈ రోజు ఆక్రమణలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నామని గ్రామస్థులు వెల్లడించారు. అక్కడ పోతురాజు బాబు మూలవిరాట్టు ఉందని.. త్వరలో గుడి నిర్మిస్తామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details