తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని దమ్ములపేటలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు గత ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించింది. దాన్ని చదును చేస్తున్న క్రమంలో.. స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టాలు తమకిచ్చి ఆర్టీసీకి స్థలం కేటాయించారని స్థానికులు ఆరోపించారు.
'పట్టాలు మాకిచ్చి.. స్థలాన్ని ఆర్టీసీకి కేటాయిస్తారా..?' - కాకినాడ వార్తలు
కాకినాడలోని దమ్ములపేటలో పేదలకు ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించింది. అక్కడ జరుగుతున్న పనులను స్థానికులు అడ్డుకున్నారు. స్థలానికి సంబంధించి పట్టాలు ఇచ్చి... మరొకరికి ఎలా కేటాయిస్తారని లబ్ధిదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు కాకినాడ సిటీ మాజీఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మద్దతుగా నిలిచారు.
బాధితులకు తెదేపా కాకినాడ సిటీ మాజీఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ములపేటలో 350 పట్టాలు అందాయని, ఇళ్లు కూడా మంజూరయ్యాయని తెలిపారు. పేదలకు ఇచ్చిన స్థలాన్ని సీఎం జగన్ వెనక్కి తీసుకోవడం సరికాదన్నారు. పనులను అడ్డుకున్న వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని.. బందోబస్తు పెట్టి పనులు చేయిస్తున్నారని విమర్శించారు. పేదలకు అన్యాయం జరిగితే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:చదువుల నిలయం.. సమస్యల తాండవం..!