తూర్పు గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లోని భూములు కోతకు గురౌతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజి నుంచి.. నీటిని విడుదల చేయటంతో ఐ.పోలవరం మండలంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ కారణంగా ఎదుర్లంక గ్రామ ఎస్సీ సొసైటీకి చెందిన వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కోత కారణంగా.. ఐదేళ్లుగా విలువైన భూమిని కోల్పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వరద ప్రవాహ వేగం అంతగా లేకపోయినా రానున్న రెండు రోజుల్లో ఉద్ధృతి ఎక్కువైతే.. ఉన్న కొద్దిపాటి భూమిని పూర్తిగా కోల్పోతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వరద ప్రవాహంతో.. లంక గ్రామాల్లో కోతకు గురవుతున్న భూములు - Land erosions in Lankan villages
ధవళేశ్వరం బ్యారేజి నుంచి.. నీటిని విడుదల చేయటంతో తూర్పు గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లోని భూములు కోతకు గురౌతున్నాయి. ఫలితంగా వందల ఎకరాల కొబ్బరి తోట వరద నీటిలో కొట్టుకుపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
Lankan villages