ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంపకలోవ సొసైటీ వద్ద రైతుల ఆందోళన - లంపకలోవ సొసైటీ స్కామ్ వార్తలు

"కోటి ముప్పై లక్షల రూపాయల సొసైటీ నిధులు కాజేసిన ఛైర్మన్ గొంతిన సురేష్​ను అరెస్ట్ చేయాలి" అంటూ.. తూర్పు గోదావరి జిల్లా లంపకలోవ సొసైటీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.

Lampakalova Society Scam in East godavari
లంపకలోవ సొసైటీ వద్ద రైతుల ఆందోళన

By

Published : Apr 5, 2021, 3:37 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ సొసైటీలో నిధుల దుర్వినియోగంపై చర్యలు చేపట్టి.. ఛైర్మన్ గొంతిన సురేష్​ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సొసైటీ వద్ద ఆందోళన చేపట్టారు. "ఛైర్మన్ కాజేసిన కోటి ముప్పై లక్షల రూపాయలు తిరిగి వసూలు చేయాలి" అని తేల్చి చెప్పారు. రైతుల ఫిర్యాదుపై అసిస్టెంట్ రిజిస్టర్ శివ కామేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొసైటీలో ముగ్గురు సభ్యుల పాలక వర్గం ఏర్పాటు చేశారు.

లంపకలోవ పాలక వర్గ ఛైర్మన్​గా గొంతిన సురేష్ దాదాపు 18 నెలలు పనిచేశారు. ఈ పద్దెనిమిది నెలల కాలంలో సొసైటీ నిధుల విషయంలో అవినీతికి పాల్పడ్డారని రైతులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. 70 లక్షలు రూపాయలు రైతుల ధాన్యం డబ్బులు, ఇతర నిధులు కలిపి కోటి ముప్పై లక్షలు ఛైర్మన్ గొంతిన సురేష్ దోచుకొన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారు చేసిన ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టామని... పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని అసిస్టెంట్ రిజిస్టర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details