తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లోని 16 గ్రామ పంచాయతీలోని గ్రామ సచివాలయలకు అమరావతి నుంచి లామినేషన్ మిషన్లు వచ్చాయి. ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా వివిధ కార్డులు బట్వాడా చేస్తారు. అలాంటి వాటికి లామినేషన్ మిషన్ అవసరం. ఇప్పుడు ఇవి కేటాయింపులు జరిగాయి.
గ్రామ సచివాలయలకు లామినేషన్ యంత్రాలు - తూర్పు గోదావరి జిల్లా
వైకాపా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థకు దశలవారీ సదుపాయాలు సమకూరుతున్నాయి. 6 నెలల క్రితం సచివాలయాలకు ఫర్నిచర్ ఇతర రికార్డులు వచ్చాయి. ఇప్పుడు ఏపీ సచివాలయంకి ఒక లామినేషన్ మిషన్ అందుబాటులోకి వచ్చింది.
గ్రామ సచివాలయలకు లామినేషన్ యంత్రాలు