తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రుచి సోయా కంపెనీ కార్మికులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. గత కొన్నేళ్లుగా వేతనాలు పెంచడం లేదని..పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదని కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలోనూ కార్మికులు పని చేసి పరిశ్రమకు లాభాలు అందించినా.. కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు.
కాకినాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన - laboures protest news east godavari district
కనీస వేతనాలు అమలు చేయాలంటూ కాకినాడ రుచి సోయా కంపెనీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు.
కాకినాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన
TAGGED:
labours protest at kakinada