తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ల నియామకాల్లో లోపాలు సరిదిద్దాలని ల్యాబ్ టెక్నీషియన్లు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల జరిగిన నియామకాల ప్రక్రియలో మెరిట్ ఆధారంగా ప్రకటించిన అర్హుల జాబితాలో తప్పులు ఉన్నాయని ఆరోపించారు. ఒకేషనల్ వారికి అవకాశం ఇచ్చినా .. డిప్లొమో, బీఎస్సీ, ఎమ్మెల్టీ అభ్యర్ధులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
'గ్రేడ్ -2 ల్యాబ్ టెక్నీషియన్ నియామకాల్లో లోపాలు సరిదిద్దాలి' - తూర్పుగోదావరి జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ నియామకాలు
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ల్యాబ్ టెక్నీషియన్లు ధర్నా చేశారు. జిల్లాలోని గ్రేడ్ -2 ల్యాబ్ టెక్నీషియన్ నియామకాల్లో లోపాలు సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
Lab Technicians