తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దంపతులు పసుపు, కుంకుమలు అందించారు. ఈ నెల 25న గృహ ప్రవేశాలు చేస్తున్న వారితో కార్యక్రమం నిర్వహించారు. డీడీలు చెల్లించిన వారందరికీ తప్పనిసరిగా ఇళ్లు కేటాయించాలని భవానీ డిమాండ్ చేశారు.
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పసుపు-కుంకుమలు పంపిణీ - రాజమహేంద్రవరం వార్తలు
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దంపతులు రాజమహేంద్రవరంలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పసుపు కుంకుమలు అందించారు. తెదేపా పోరాటం ఫలితంగానే ప్రభుత్వం ఈనెల 25న గృహ ప్రవేశాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
పసుపు కుంకుమలు పంపిణీ
తెదేపా పోరాటం ఫలితంగానే ప్రభుత్వం టిడ్కో గృహాలపై స్పందించిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్ ఏడాదిన్నర పాటు గృహాలను మంజూరు చేయలేదని ఆరోపించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వామ్మో..! వింత జంతువులా ఉంది... కాదు.. తెలిసిందే..!!