తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు గోతిలో పడి రెండు చక్రాలు ఊడిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం రావులపాలెం మీదుగా నరసాపురం వెళ్తుండగా.. రావులపాడు జాతీయ రహదారి పైకి వచ్చేసరికి బస్సు వెనుక చక్రాల రహదారిపై ఉన్న గోతిలో కూరుకుపోయాయి.
గోతిలో ఆర్టీసీ బస్సు.. క్షేమంగా ప్రయాణికులు - గోతిలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు తాజా వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు తూర్పు గోదావరి జిల్లా రావులపాడు జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు వెనుక టైర్లు గోతిలో కూరుకు పోగా.. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
గోతిలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు
రెండు చక్రాలతో కలిపి ఇనుప రాడ్డు ఊడిపోయిన ఈ ఘటనలో ఒక్కసారిగా బస్సు నేలను తాకింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ఇంజన్ను నిలుపుదల చేసిన కారణంగా.. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇవీ చూడండి: