కోవిడ్-19ను నివారించేందుకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చే వారిని గుర్తించి వైరస్ నివారణ పరీక్షలు చేయడానికి, వైద్య ఆరోగ్య శాఖతో పాటు పని చేస్తాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాం నయిం అస్మీ తెలిపారు. కరోనా వైరస్‌పై తీసుకోవల్సిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను ఎస్పీ విడుదల చేశారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులకు రక్షణ దుస్తులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ హారీఫ్, ఏఎస్పీ కరణం కుమార్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్-19 నివారణకు జిల్లాలో ప్రత్యేక బృందం
కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ 22 మంది సభ్యులతో రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అద్నాం నయీం అస్మీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఈ టాస్క్‌ఫోర్సు బృందాలు సహకారం అందించనున్నాయి.
కోవిడ్-19 నివరాణకు జిల్లాలో ప్రత్యేక బృందం