తప్పుడు ప్రచారాలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవు - kottapeta mla chirla jaggireddy press meet
ప్రజల అండదండలతో ఆరోగ్యంగానే ఉన్నానని.. తనకు కరోనా వచ్చిందని చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైకాపా కార్యాలయంలో కోరారు. కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించవలసిన సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందినవారు రాజకీయాలు చేయడం తగదన్నారు.
తనకు కరోనా వచ్చిందని చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైకాపా కార్యాలయంలో అన్నారు. నా గన్ మాన్‌కి పాజిటివ్ వచ్చిన తరుణంలో బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా 13న వైద్య పరీక్షలు చేయించుకుంటే నెగటివ్ వచ్చిందన్నారు. తాను పుట్టినరోజు పార్టీల్లో పాల్గొన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని.. ఇలాంటి ప్రచారాలు చేసినవారు వాటిని నిరూపించాలని కోరారు. వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోడానికి వెనుకాడబోనని హెచ్చరించారు.