భద్రాచలం, ఒంట్టిమిట్టలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి... కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకుడు అప్పారావు ఏటా కోటి తలంబ్రాలను అందిస్తాడు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో ఉన్న తన పొలంలో కోటితలంబ్రాల పంటను సాగుచేసాడు. శ్రీరామనామ స్మరణతో... కీర్తనలను అలపిస్తూ... వరి కోత కార్యక్రమం నిర్వహించారు. భక్తులు శ్రీరామ నామాన్ని స్మరిస్తూ వడ్లను గోటితో వొలిచి తలంబ్రాలను స్వామివారి కల్యాణానికి పంపిస్తామని అప్పారావు తెలిపారు.
ఒంటిమిట్ట శ్రీరాముని కల్యాణానికి... కోటి తలంబ్రాలు - koti talambralu at east godavari district
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో... భద్రాచలం, ఒంటిమిట్ట శ్రీరాముని కల్యాణానికి తలంబ్రాలు పంపించడానికి వరికోత నిర్వహించారు. శ్రీరాముడు,ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడి వేషధారణలతో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![ఒంటిమిట్ట శ్రీరాముని కల్యాణానికి... కోటి తలంబ్రాలు koti talambralu for ontimitta srirama kalyanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5323259-958-5323259-1575919734386.jpg)
ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణానికి కోటి తలంబ్రాలు కార్యక్రమం