కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని వైకాపా జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజులు తెలిపారు. గోదావరి వరదల వలన నష్టపోయిన రైతులు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి విస్తృత పర్యటనలు చేశారు. అనంతరం అస్వస్థతకు గురై... కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండటానికి నిర్ణయించుకున్నారు. అందువలన 14 రోజుల పాటు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో ఉండరని... ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని తెలిపారు.
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా పాజిటివ్
కొత్తపేట ఎమ్మెల్యేకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వైద్యుల సూచనలు తీసుకుని హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల పర్యటన అనంతరం వీరు అస్వస్థతకు గురయ్యారు.
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి