తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షలు విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లో ఏకకాలంలో పోలీసులు జరిపిన దాడుల్లో కాకినాడ, పిఠాపురం, కోరుకొండకు చెందిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం పోలీస్ అర్బన్ జిల్లా పరిధిలోని ఉత్తర మండల డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు నిందితులను విచారించారు. అనంతరం పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి , సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
25 లక్షలు విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తుల స్వాధీనం - banned gutka seized at east godavari district latest news
25 లక్షలు విలువైన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను కోరుకొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో నిషేధిత గుట్కా అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
25 లక్షలు విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు