తూర్పు గోదావరి జిల్లాలోని చారిత్రక కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథశాలకు పటిష్ఠ భద్రత చర్యలు చేపడుతున్నామని శాసనసభ్యుడు , రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. గురువారం ఆయన స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రథశాలకు భద్రతా చర్యల్లో భాగంగా షట్టర్ ఏర్పాటు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై ఆలయ సిబ్బందితో చర్చించారు.
కోరుకొండ నరసింహ స్వామి రథాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే - Korukonda Narasimha Swamy MLA inspected the chariot
కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథశాలకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు.
కోరుకొండ నరసింహ స్వామి రథం పరిశీలించిన ఎమ్మెల్యే