గోదావరి వరదతో లంక గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ లంక గ్రామాల ప్రజలు బయటకు రావడానికి పడవల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కోనసీమలోని ఉప్పలగుప్తం మండలం మినహా మిగిలిన 15 మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. 50 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
పడవల కోసం వరద బాధితుల నిరీక్షణ - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
కోనసీమ లంక గ్రామాలు వరద ముంపులో ఇబ్బందులు పడుతున్నాయి. 15 మండలాల్లోని 50 గ్రామాలు వరదతో జలదిగ్బంధంలో ఉన్నాయి. పడవలు లేక బయటకు వచ్చేందుకు బాధితులు నిరీక్షిస్తున్నారు.
పడవల కోసం వరద బాధితుల నిరీక్షణ