భక్తులతో కిక్కిరిసిన కోనసీమ తిరుపతి - కోనసీమ తిరుపతి
7 శనివారాల నోము సందర్భంగా కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. గోవింద నామ స్మరణతో ఆలయం మార్మోగింది.
తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం గోవింద నామ స్మరణతో మార్మోగిపోయింది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంలో 7శనివారాల నోము సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. 7శనివారాలు.. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.