కోనసీమ గ్రామాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇతర గ్రామాల నుంచి తమ గ్రామంలోకి రావొద్దంటూ బోర్డులు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పలు గ్రామాల ప్రజలు వారి పరిధిలోని రహదారుల మీద అడ్డుగా బోర్డులు ఏర్పాట్లు చేశారు. రహదారులు మూసేశారు. కరోనా వైరస్ నివారణకు ప్రధానమంత్రి లాక్ డౌన్ ప్రకటించిన మేరకు మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
ఇలా చేయకపోతే.. మనం బతకలేము
మా గ్రామంలోకి రావద్దు అంటూ కోనసీమలోని పలు గ్రామాల్లోని ప్రజలు రహదారులను మూసేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ప్రజలు లాక్డౌన్ను స్వీయ నియంత్రణతో పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కోనసీమలోని రహదారులు మూసివేత