తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుణ్ని ఓ ఇటుక బట్టీ వద్ద వదిలి వెళ్లారు కిడ్నాపర్లు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు, లొల్ల గ్రామాల మధ్యలో ఉన్న కేకేఆర్ బ్రిక్స్ వద్ద బుధవారం రాత్రి విడిచి పెట్టారు. అర్థరాత్రి 2గంటల సమయంలో ఇటుకల బట్టిలో పని చేసే కార్మికుడు లేచి మూత్రవిసర్జన చేసుకోవడానికి బయటకు రావటంతో... జషిత్ అతనికి కనిపించాడు. అతను ఇటుకుల బట్టి యజమానికి సమాచారం ఇవ్వగా ఆయన ఉదయం నాలుగు గంటల సమయంలో జషిత్ తల్లిదండ్రులకు, పోలీసులుకు సమాచారమిచ్చాడు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు బాలుడు జషిత్ ను మండపేట తీసుకువెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.
అర్ధరాత్రి ఇటుకల బట్టీ వద్ద ఒంటరిగా జషిత్... - mandapets
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్‌కు గురైన జషిత్‌ను కుతుకులూరు, లొల్ల గ్రామాల మధ్యలో ఉన్న కేకేఆర్ బ్రిక్స్ వద్ద బుధవారం రాత్రి కిడ్నాపర్లు వదిలి వెళ్లిపోయారు... బాలుడిని ఎవరు వదిలారో... ఏ సమయంలో వదిలారో కేకేఆర్ బ్రిక్స్ లో పని చేసే వారి మాటల్లోనే

జషిత్ కోసం ఇటుకల బట్టీకి పోలీసులెందుకెళ్లారు...!
జషిత్ కోసం ఇటుకల బట్టీకి పోలీసులెందుకెళ్లారు...!
ఇదీ చదవండి
Last Updated : Jul 25, 2019, 12:17 PM IST