తూర్పుగోదావరి మండపేట విజయలక్ష్మినగర్‌లో అపహరణకు గురైన చిన్నారి జషిత్ ఆచూకి ఈరోజు ఉదయం తెలిసింది. బాబు క్షేమంగా ఉండడం చాలా ఆనందంగా ఉందని, కిడ్నాపర్లు ఎటువంటి హాని తలపెట్టలేదని ఎస్పీ నయీం అస్మి తెలిపారు. కుతుకులూరు వద్ద ఇవాళ ఉదయం బాలుడిని కిడ్నాపర్లు వదిలివెళ్లారని... సమాచారం తెలియగానే పోలీసుల బృందం వెళ్లి తీసుకొచ్చిందని నయీం వివరించారు. భద్రంగా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.
అపహరణకు గురైన బాలుడు జషిత్ క్షేమం బాలుడిని తల్లిచెంతకు చేర్చిన పోలిసులు ముఖ్యమంత్రి అభినందనలు
తూర్పుగోదావరిజిల్లా మండపేటలో కిడ్నాపైన బాలుడు జషిత్‌ను క్షేమంగా రక్షించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హష్మిని, ఇతర సిబ్బందిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.
ఈమేర ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. జషిత్‌ను రక్షించడంతో పని యాభైశాతం పూర్తయ్యిందని, మిగిలిన 50శాతం కిడ్నాపర్లను పట్టుకోవడమని ఎస్పీకి సూచించారు. ఈ చర్యకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని, చట్టం ముందు నిలబెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇది చూడండి: బురదలో ఆటలూ స్కూల్ టైమ్‌టేబుల్‌లో భాగమే!