తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా కట్ట సింహాచలం బాధ్యతలు చేపట్టారు. విజయనగరంలో సహాయ కలెక్టర్‌గా ట్రైనింగ్ పూర్తి చేసిన తనకు.. మొదటి పోస్టింగ్ ఏజెన్సీ ప్రాంతంలో ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉంటాయని.. అందులో అతను భాగమవ్వటం ఆనందాన్నిచ్చే విషయమన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు, మీడియా సహకారం అవసరమని తెలిపారు. ఏవైనా సమస్యలు మీ దృష్టికి వస్తే.. తమకు తెలియజేయాలని మీడియా వారిని కోరారు.
రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా కట్ట సింహాచలం బాధ్యతల స్వీకరణ
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా కట్ట సింహాచలం బాధ్యతలు స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, మీడియా, ప్రజల సహకారంతో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. అంధుడైన అతను.. పట్టుదలతో ఐఏఎస్ అయినట్లు తెలిపారు.
సబ్ కలెక్టర్‌గా కట్ట సింహాచలం బాధ్యతల స్వీకరణ
2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సింహాచలం.. జిల్లాలోని మలికిపురం మండలం గుడపల్లి గ్రామానికి చెందినవారు. ఈయన పుట్టుకతోనే అంధుడు. అయితే పట్టుదల, కుటుంబ సహకారంతో ఐఏఎస్ అయ్యానని చెప్పారు. ఇప్పటివరకు ఆర్డీవోగా పనిచేసిన సీనా నాయక్ సబ్ కలెక్టర్ సింహాచలానికి బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి:గుర్తు తెలియని వాహనం ఢీ... తండ్రి, మూడేళ్ల కుమార్తె మృతి