ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలోని ఆ గ్రామంలో కొబ్బరి చెట్లను తొలగిస్తున్నారు..! - konaseema latest news

కోనసీమ ప్రజలకు కొబ్బరి చెట్లు అంటే ప్రాణం. అవే వారి జీవనాధారం. ప్రతి ఇంటి పరిసరాలలో 5 నుంచి 10 వరకు కొబ్బరి చెట్లు ఉండి తీరుతాయి. ప్రకృతి విపత్తులు.. తుపానుల కారణంగా చెట్లు పడిపోవడం తప్ప ఏ ఒక్కరు తొలగించరు. ఇంటి నిర్మాణంలో అడ్డొచ్చినా.. వాటితో కలిపి భవనాలు నిర్మించుకున్నవారు ఎందరో ఉన్నారు. చెట్లతో ఇంతటి అనుబంధం పెంచుకున్న ఓ గ్రామస్తులు.. తోటి వారి ప్రాణాలు పోతుండడంపై మనసు చంపుకొని చెట్లను నరికేస్తున్నారు.

Karrivani Revu People Removed coconut trees
కోనసీమలోని ఆ గ్రామంలో కొబ్బరి చెట్లను తొలగిస్తున్నారు..!

By

Published : Oct 7, 2020, 5:51 PM IST

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కర్రివానిరేపు పంచాయతీ పరిధిలో రహదారికి ఇరువైపులా విద్యుత్ స్తంభాలను అనుకొని కిలోమీటర్ల పొడవునా కాపుతో ఉన్న కొబ్బరి చెట్లను.. వాటి యజమానులు నరికివేస్తున్నారు. ఇటీవల దింపు కార్మికులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడం... ఈదురు గాలులు, వర్షాల కారణంగా తీగలపై ఆకులు, చెట్లుపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం వంటి సంఘటనలు జరిగాయి. 15 సంవత్సరాల పైబడిన చెట్లు ఎత్తుగా ఎదిగి గాలిలో ఊగుతూ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోని అంతా ఆందోళన చెందారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులంతా స్వచ్ఛందంగా చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. వీరికి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సహకరించారు.

ABOUT THE AUTHOR

...view details