ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరికి కార్తిక శోభ.. భక్తుల పుణ్యస్నానాలు

కార్తిక సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. గోదావరి తీరం కార్తిక శోభతో విరాజిల్లుతోంది. రాజమహేంద్రవరంలో తెల్లవారుజాము నుంచే నదిలో వివిధ ఘాట్ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు చేశారు. నదిలో దీపాలు వెలిగించి... దీపదానాలు చేశారు.

గోదావరిలో కార్తిక శోభ

By

Published : Nov 11, 2019, 2:43 PM IST

గోదావరిలో కార్తిక శోభ

కార్తిక సోమవారం పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ద్రాక్షారామంలో వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. అన్నవరం దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యదేవుని వ్రతమాచరించి... స్వామిని దర్శించుకున్నారు.
యానాంలోని మురుమళ్ళలో వృద్ధ గౌతమి గోదావరిలో తెల్లవారుజాము నుంచే మహిళలు స్నానాలు ఆచరించి గోదావరిలో దీపాలను వదిలారు. రాజమహేంద్రవరంలో భక్తులు నదిలో వివిధ ఘాట్ల వద్ద స్నానాలు చేశారు. పలివెలలో శ్రీ కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details