ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముద్రగడను విమర్శించే స్థాయి ఎవరికీ లేదు' - kapu jac news

కాపుల ఉద్యమ నాయకుడు ముద్రగడను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని పోరాటసమితి ఐకాస నాయకులు అన్నారు. ఉద్యమాన్ని ఆయనే ముందుండి నడిపించాలని కోరారు.

kapu leaders
కాపు నేతలు

By

Published : Jul 14, 2020, 6:40 PM IST

కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ.. కాపులను ఆవేదనకు గురి చేసిందని పోరాట సమితి రాష్ట్ర ఐకాస సభ్యలు చెక్కపల్లి సత్తిబాబు అన్నారు. ఆయనే ముందుండి కాపు ఉద్యమాన్ని నడిపించాలని కోరారు. తుర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో రాష్ట్ర కాపు ఐకాస నేతలందరూ సమావేశమయ్యారు.

ఉద్యమంలో ఎప్పుడూ ప్రత్యక్షంగా పాల్గొనని వ్యక్తులు ముద్రగడను విమర్శించటం హాస్యాస్పదమని అన్నారు. ముద్రగడను విమర్శించే స్థాయి ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోవాలని విమర్శకులకు వారు హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details