తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన పోర్టు భూములను మడ అడవులనే సాకును చూపించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూముల్లో మడ అడవులు లేవని అటవీశాఖ, మత్స్య సంపద పుట్టదని మత్స్యశాఖ స్పష్టం చేశాయని తెలిపారు. ఈ భూములు సీఆర్జెడ్ పరిధిలో లేవని కూడా అనుమతించిందని స్పష్టం చేశారు. తెలుగుదేశం సభ్యులు ఆ భూముల్లోకి వెళ్లి ఉంటే లబ్ధిదారులే తగిన సమాధానం చెప్పేవారని ఎమ్మెల్యే తెలిపారు.
'పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా ఆ పార్టీ ఆడ్డుకుంటోంది' - కాకినాడలో పేదలకు ఇళ్లస్థలాలు
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తెదేపా అడ్డుపడుతోందని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. తెదేపా నేతలు పోర్టు భూములను మడ అడవులనే సాకును చూపించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు.
kakinada mla