సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో నకిలీ ఖాతా తెరిచారు.. సైబర్ నేరగాళ్లు. ఆ ఖాతా నుంచి.. ఎమ్మెల్యే పేరుతో ఇతరులకు సందేశాలు పంపించారు. రూ. 15 వేలు డిపాజిట్ చేయాలంటూ మెసేజ్లు పంపారు.
ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ద్వారంపూడి.. జిల్లా ఎస్పీ నయీం అద్నాం అస్మీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.